KMR: బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ సర్పంచ్, దేవరబోయిన వాణి వాసు యాదవ్ రాష్ట్ర సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. శనివారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో, ఆమెను సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలను, పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.