AP: కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియకు YCP పూర్తి మద్ధతు ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రాతినిధ్యం ఉండటం ప్రజాస్వామ్యబద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.