KNR: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వేస్ట్ టు ఎనర్జీ పవర్ రైట్ నిర్మాణ రద్దు కొరకై చేపట్టిన నిరాహార దీక్ష బుధవారంతో 24వ రోజుకు చేరింది. ఈ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న అఖిలపక్ష జేఏసీకి మద్దతుగా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలంలోని 20 గ్రామాల ఉపసర్పంచులు మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఒకరోజు దీక్షలో కూర్చున్నారు.