సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నిర్వహించారు.