మెటా ఇండియా, గూగుల్, ఎక్స్, రెడిట్లకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏఐని దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలను ఈ ప్లాట్ఫామ్ల్లో పలువురు వ్యాప్తి చేస్తున్నారని.. వీటిని అడ్డుకోవాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ కంటెంట్‌ను తొలగించడానికి ముందుకు రావాలని.. మే 8న విచారణకు రావాలని పేర్కొంది.