VKB: షీ టీమ్స్‌పై బుధవారం పరిగి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల విద్యార్థులకు షీ టీమ్ ఇంఛార్జ్ నర్సింలు అవగాహన కల్పించారు. బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమన్నారు. పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100,181కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.