TG: వేసవి నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించాలని సూచించారు. అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక ఎమర్జెన్సీ టీమ్స్ ఉండాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.