TG: తెలంగాణలో కులగణన లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజికవర్గం మాదిగ(SC)గా పేర్కొంది. మాదిగల జనాభా 36 లక్షల 57 వేల 551 కాగా రాష్ట్ర జనాభాలో వారు 10.3 శాతంగా ఉన్నారు. జనాభాలో రెండో స్థానంలో BC-Eకి చెందిన షేక్‌లు నిలిచారు. షేక్‌ల జనాభా 27 లక్షల 95 వేల 727 కాగా రాష్ట్ర జనాభాలో 7.9 శాతం అని తేలింది.