PDPL: రామగుండం NTPC మేడిపల్లి సెంటర్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంతోష్ కుమార్ అనే పూజారి మృతి చెందాడు. బైక్పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన బూడిద లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ టైరు పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. NTPC పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.