AP: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్రమంత్రి శివరాజ్సింగ్తో వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శనగల సాగు, ఉత్పత్తి పెరిగాయి. శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి. అదనంగా 15 వేల టన్నుల కొనుగోలు కేంద్రానికి అనుమతివ్వాలి. 7.13 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరిగింది’ అని తెలిపారు.