KMM: రఘునాథపాలెం మండలం కేవీ బంజార గ్రామంలో శనివారం విత్తన అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తున్న నాణ్యమైన వరి, పెసర, కంది, మినుము వంటి విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.