AP: తూ.గో జిల్లా నిడదవోలు NDA నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టారు. హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు నిరసన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో BJP చీఫ్ మాధవ్, మంత్రి కందుల దుర్గేష్, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, కూటమి నేతలు పాల్గొన్నారు.