NZB: నగరంలోని వ్యవసాయ మార్కెట్‌ను రైతులు బుధవారం ముట్టడించారు. ఈ మేరకు పసుపు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వారు అధికారులను ఘెరావ్ చేశారు. సుమారు 50 వేలకు పైగా పసుపు యార్డులో డంప్ అయ్యిందని రైతులు అవేదన వ్యక్తం చేశారు. అయితే ఆన్లైన్లో రూ.16 వేలు క్వింటాల్ ధర ఉండగా.. మార్కెట్లో ఆఫ్‌లైన్‌లో మాత్రం రూ. 13 వేలకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.