VSP: కైలాసగిరిపై నిర్మిస్తున్న త్రిశూల్ను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పనుల ప్రగతిని పరిశీలించి ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పరిసరాల్లో పచ్చదనం, బెంచీలు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.