TG: డీలిమిటేషన్ చట్టాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ చేసిన డీలిమిటేషన్ వల్ల ఉమ్మడి ఏపీలో ఒక లోక్సభ సీటు తగ్గిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.