TG: కేవలం 4 నెలల్లోనే జర్మన్ లాంగ్వేజ్ నేర్పించేలా టామ్ కామ్ కసరత్తు చేస్తుందని మంత్రి వివేక్ అన్నారు. దీని కోసం ప్రత్యేకంగా టామ్ కామ్ మోడల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 90 కోట్లను కేటాయించిందన్నారు. కేవలం ఉద్యోగాలే కాకుండా, రైతులకు ఉపయోగపడేలా సాయిల్ టెస్టులు, పంట మార్పిడి వంటి అంశాలపై సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు.