WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో గురువారం రాత్రి రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలపై పాటలు, నాటికల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్, గ్రామ సర్పంచ్ తోర్రీ. పద్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.