ADB: మున్సిపల్ విలీన వార్డుల అభివృద్ధికి రూ. 30 కోట్లు కేటాయించడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణానికి శాశ్వత నీటి సమస్య పరిష్కారంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం పటిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని పేర్కొన్నారు.