MBNR: మూసాపేట మండలం సంకలమద్దికి చెందిన మద్దెల అంజి, స్నేహితులతో కలిసి నిన్న రాత్రి కందూర్ స్టేజి సమీపంలోని హోటల్లో భోజనం చేస్తుండగా మటన్ బొక్క గొంతులో ఇరుక్కొని మరణించాడు. వారు భయంతో డేడ్బాడీని మూసాపేటలోని కల్లు కాంపౌండ్ ఆవరణలో వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామాకు తరలించారు.