GNTR: తెనాలిలో కుటుంబ కలహాలు హింసకు దారితీశాయి. గురవయ్య కాలనీకి చెందిన నాగరాజు తన భార్యతో తరచూ గొడవలకు వదినే కారణమని భావించి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్లేడ్‌తో వదినపై దాడి చేయగా ఆమె ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.