అన్నమయ్య: స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లి పట్టణంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ప్రమీల అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రజలంతా భాగస్వాములై సాధిద్దామని పిలుపునిచ్చారు.