తిరుపతి స్విమ్స్, కడ ఆధ్వర్యంలో ఈనెల 20న కుప్పం GHలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. 35 నుంచి 65 ఏళ్ల మహిళలకు పింక్ బస్ ద్వారా ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతర వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు.