PPM: పాచిపెంట మండలం పి.కొనవలస ఒడిశా ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం ఆర్గాన్ లిక్విడ్ లారీ బోల్తా పడింది.పోలీసుల వివరాల ప్రకారం జగదల్పూర్ నుంచి విశాఖ వెళుతున్న లారీ స్దానిక చెక్ పోస్టు సమీపంలో బోల్తా పడింది.ఈ ఘటనలో డ్రైవర్ ప్రమోద్ కుమార్ రాయ్ తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం సాలూరు తరలించారు. CI రామక్రిష్ణ పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసారు.