TG: మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గుర్రంపోడు మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, స్థానిక సమస్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులు అన్ని ఏర్పాటు చేశారు.