NZB: మోపాల్ మండల రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహించిన 5 రోజుల శిక్షణా తరగతులు శనివారం సాయంత్రం ముగిశాయి. 2018 పంచాయతీరాజ్ చట్టం, సభ్యుల విధులు, గ్రామ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. అనంతరం MPDO రాములు నాయక్, MPO కిరణ్ కుమార్ సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ వికాసానికి చురుగ్గా కృషి చేయాలని ఎంపీడీవో సూచించారు.