SRPT: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తిరుచ్చి జిల్లా తురైయూర్ నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.