కోనసీమ: అంబాజీపేటలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న బండారులంక మహిళ భాగ్యలక్ష్మి IDFC బ్యాంకు సిబ్బంది తనను ఇబ్బంది పెడుతున్నారని సీఐ భీమరాజుకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. IDFC బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సకాలంలో చెల్లించలేదంటూ దుర్భాషలాడుతున్నారని, రుణం చెల్లించేందుకు గడువు కోరిన వినకుండా కాల్ మనీ పేరిట చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు.