TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో ప్లాస్టిక్ పూల విక్రయాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ మార్కెట్లు, రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల విక్రయాలపై మార్కెటింగ్ శాఖ నిషేధం విధించింది. ఇటీవల రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ ప్లాస్టిక్ పూల విక్రయాలపై ఫిర్యాదు చేశారు. తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.