కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నిన్న మూడు బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళా సవరణపై అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినా.. డీలిమిటేషన్ విషయంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో ఇవాళ ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుంది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే రాజ్యసభలో ప్రవేశపెడతారు.