BHPL: మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు బచ్చల ఎర్రయ్య మరణం పట్ల మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం సమాచారం తెలుసుకున్న వెంటనే గ్రామానికి చేరుకుని ఎర్రయ్య పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.