హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. TCAతో కలిసి పనిచేయాలని BCCI గతంలో ఆదేశించినప్పటికీ, HCA ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, TG20 లీగ్‌ను నిర్వహించడానికి హెచ్‌సీఏకు ఎటువంటి అనుమతి లేదని గురువారెడ్డి స్పష్టం చేశారు.