SKLM: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాస్తారోకో చేపడతామని ఎచ్చెర్ల మాజీ MLA కిరణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం రణస్థలంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యవసాయ సహాయ సంచాలకుడు శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరిగినా, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.