ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, గొంతు, హావభావాలను AI, డీప్‌ఫేక్ ద్వారా వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని స్పష్టం చేసింది. సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఆయన ప్రత్యేక గుర్తింపును కాపాడేలా ఆదేశాలు జారీ చేసింది.