ATP: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ మొదటి ఏడాది ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,447 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 672 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు ముగిసిన రెండు నెలల్లోపే ఫలితాలు విడుదలయ్యాయి.