MDK: వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. సరైన జాగ్రత్తలు లేకపోతే పిల్లల ఈత సరదా కాస్తా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీటి లోతు తెలియకపోవడం, ఒడ్డున జారి పడటం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.