KRNL: జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ, నెడ్‌క్యాప్ అధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. భూసేకరణ, అనుమతుల మంజూరు, మౌలిక వసతుల కల్పన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.