WGL: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని రాయపర్తి గ్రామ సర్పంచ్ రాయని యాకన్న అన్నారు. రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన వార్షికోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు, పలు ముఖ్యమైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.