ADB: ఈనెల 23న జిల్లాలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలియజేశారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగర, ఉప్పర కులస్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.