TG: విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతున్నట్లు TGSRTC జేఏసీ ప్రకటించింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 30 శాతం వేతన సవరణ(PRC), డీఏలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.