SRD: అమీన్ పూర్ డివిజన్ కిష్టారెడ్డిపేట చౌరస్తా వద్ద వాహన తనిఖీలలో నంబర్ ప్లేట్ లేని ఆటోను పోలీసులు ఆపగా డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటాడి పట్టుకుని విచారించగా హిమాన్షు యాదవ్ (22)గా గుర్తించారు. ఈనెల 21న అమీన్పూర్లో ఆటో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆటో (TG34T4937) స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్కు తరలించారు.