KNR: బాధిత మహిళలకు సఖి కేంద్రం రక్షణ కవచంలా అపన్న హస్తం అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ధైర్యము భరోసా కల్పిస్తూ అండగా నిలవాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాత్రి సఖి కేంద్రం మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో సఖి కేంద్రం ద్వారా సూచనలు చేశారు.