KDP: మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపు రెడ్డి పల్లి, మన్నూరు గ్రామాల్లో CI లింగప్ప ఇవాళ గ్రామ సభలు నిర్వహించారు. సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, నేరాలపై అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.