SKLM: జలుమూరులోని ఈనెల 27న గరీబ్ గైడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత న్యాయ సహాయ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయవాది, గరీబ్ గైడ్ సంస్థ ప్రతినిధి డి.వి.రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. లీగల్ టీం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.