GDWL: కేటిదొడ్డి మండలం కొండాపురానికి చెందిన శకుంతలమ్మ (50) పొలం నుంచి కట్టెల మోపుతో వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి గాయపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కట్టెల మోపు చెట్టుకు తగలడంతో ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.