ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని విక్రయించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యమని ఎక్సైజ్ & ప్రోహిబిషన్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలలో మద్యం బాటిల్‌ను ‘సురక్ష యాప్’ ద్వారా స్కాన్ చేసిన అనంతరం విక్రయాలు జరపాలన్నారు. నాటు సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.