TG: వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో RTC కార్మికులు ధర్నా చేపట్టారు. అత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులకు, RTC కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా RTC కార్మికులు నినాదాలు చేశారు.