PDPL: పంచాయతీరాజ్ వ్యవస్థ లక్ష్యం గ్రామ స్వరాజ్యం స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ శ్రావణి సూచించారు. ధర్మారం మండలం పత్తిపాకలో ఇవాళ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కార్యదర్శి కిరణ్ స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ అభివృద్ధి, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం 6 కమిటీలు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.