పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి వరండాలో పడుకుని ఉన్న సుజాత అనే మహిళ మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును లాక్కొని దుండగులు పరారయ్యారు. చోరీకి యత్నించిన సమయంలో మహిళ ప్రతిఘటించడంతో ఇతర వస్తువులను వదిలేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఎల్విన్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.