SRD: గ్రామాల్లో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రోగ్రాం మెడికల్ అధికారి (DPMO) సిద్ధార్థ్ అన్నారు. శుక్రవారం ఆయన సిర్గాపూర్ మండలాన్ని సందర్శించారు. తొలుత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇక్కడి పరిసరాల దుస్థితిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సుల్తానాబాద్ సబ్ సెంటర్ సందర్శించి పరిశీలించారు.