KMR: పిట్లం స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా నాజోజు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ సమావేశంలో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు, సభ్యులు శ్రీనివాస్‌ను అభినందిస్తూ ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, సంఘ ఐక్యత కోసం కృషి చేస్తానన్నారు.